IND vs AUS: రాహుల్, జడేజా హాఫ్ సెంచరీ....! 5 d ago
మూడో టెస్టులో భారత్ ఎదురొడ్డుతున్నది. కేఎల్ రాహుల్, జడేజా మినహా బ్యాటర్లంతా విఫలమవడంతో పీకల్లోతు కష్టాల్లో భారత్ కూరుకుపోయింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ రాహుల్‌ను (84) స్పిన్నర్ లియాన్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి జడేజాకు మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ 82 బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అయితే వర్షం పదే పదే అడ్డుపడుతుండటంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 6 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. జడేజా 52(88), నితీశ్ 9(26) రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 265 పరుగులు వెనుకంజలో ఉన్నది.